టీఎన్జీవో ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైన క్రీడలు..

by Disha Web Desk 20 |
టీఎన్జీవో ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైన క్రీడలు..
X

దిశ, నిజామాబాద్ సిటీ : టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్ అధ్యక్షతన, 34వ జిల్లా స్థాయి అంతర్ శాఖల క్రీడాపోటీల్లో భాగంగా స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. మొదటి రోజు క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా మొదటి మ్యాచ్ జడ్పీవర్సెస్ డీడబ్యు ఏఎంఏ తలపడగా, మొదటగా బ్యాటింగ్ చేసిన జడ్పీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేయగా, 77 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన డీడబ్యు ఏఎంఏ జట్టు 3 టికెట్లు కోల్పోయి 8 ఓవర్లలో 77 భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. 19 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సుశీల్ రెడ్డిని, ఇరు జట్టులను అభినందించి టీఎన్జీవో జిల్లాఅధ్యక్ష కార్యదర్శులు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రెండవ మ్యాచ్ వ్యవసాయ శాఖ వర్సెస్ పోలీస్ శాఖలు తలపడగా, అగ్రికల్చర్ జట్టు విజయం సాధించింది. రెండో పీచులు రెండో మ్యాచ్ ఆర్ అండ్ బీ వర్సెస్ రిజిస్ట్రేషన్ శాఖలు తలపడగా ఆర్ అండ్ బీ శాఖ విజయం సాధించింది. మొదటి పిచ్ మూడో మ్యాచ్ టీపీఓ వర్సెస్ డీపీఓ శాఖలు తెలపడగా డీపీఓ జట్టు విజయం సాధించింది. పిచ్ రెండులో మూడో మ్యాచ్ ఇరిగేషన్ వర్సెస్ మెడికల్ శాఖలు తెలపడగా ఇరిగేషన్ శాఖ విజయం సాధించింది. మొదటి పిచ్ నాలుగో మ్యాచ్ సర్వే శాఖ వర్సెస్ అనిమల్ హస్బెండ్రీ తలపడగా అనిమల్ హస్బండ్రీ శాఖ విజయం సాధించింది. జట్టు విజయం సాధించి, విజయాన్ని కారకులైన క్రీడా కారులను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న క్రీడాకారులను అధ్యక్ష కార్యదర్శులు శుభాకాంక్షలు తెలిపారు.


Next Story

Most Viewed