2న మంది రాములు మహారాజ్ అనుష్టాన దీక్ష ప్రారంభం..

by Nallavelli.Anjaneyulu |

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గం లోని నందిపేట్ మండల కేంద్రంలో గల కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పరమహంస పరివ్రాజక బాలయోగి

2న మంది రాములు మహారాజ్ అనుష్టాన దీక్ష ప్రారంభం..
X

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గం లోని నందిపేట్ మండల కేంద్రంలో గల కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజు లోక కళ్యాణార్థం పరమశివుని ఆశీస్సులతో గత 39 సంవత్సరాలుగా అనుష్ఠాన దీక్షను చేస్తున్నారు. ఈ ఏడాది కూడా లోక కళ్యాణార్థంలో భాగంగా 40 వ అనుష్టాన దీక్ష విజయదశమి పర్వదినం రోజున వచ్చే నెల రెండవ తేదీన గురువారం ఉదయం 9.45 లకు ప్రారంభిస్తారని కేదారేశ్వర ఆశ్రమ కమిటీ సభ్యులు, న్యాయవాది వెంకట సాయి కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. సమస్త భక్త జనులందరూ ఈ అనుష్టాన దీక్ష ప్రారంభోత్సవ వేడుకలకు మంగి రాములు మహారాజు ఆశీస్సులు, అనుగ్రహం పొందాలని తెలిపారు.

Next Story