లోన్ యాప్స్ తో జాగ్రత్త : నార్త్ రూరల్ సీఐ నరహరి

by Disha Web Desk 20 |
లోన్ యాప్స్ తో జాగ్రత్త : నార్త్ రూరల్ సీఐ నరహరి
X

దిశ, నవీపేట్ : లోన్ యాప్స్, ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్త్ రూరల్ సీఐ నరహరి తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ లో నకిలీ లోన్ యాప్స్ ఉన్నాయని, తక్కువ వడ్డీకే ఎలాంటి పూచీకత్తు లేకుండా లోన్స్ ఇస్తామని చెప్పి అధికవడ్డీ వసూలు చేస్తున్నాయని తెలిపారు. లోన్ కట్టని వారి కాంటాక్ట్, వాట్సాప్ నంబర్స్ కు మెసేజ్ లు చేస్తూ మానసికఒత్తిడికి గురిచేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇలా మోసపోయిన బాధితులు దైర్యంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి కానీ అధైర్యంతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు.

లక్కీ డ్రా లో లక్షల రూపాయల బహుమతులు వచ్చాయని, తెలియని నెంబర్ ల నుండి వచ్చే లింక్ లను క్లిక్ చేసి వారు అడిగే ఓటీపీ నెంబర్ లను చెప్పి డబ్బులు లాసవ్వొద్దని తెలిపారు. ఆన్లైన్ మోసాలపై, నకిలీ లోన్ యాప్ లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లోన్ తీసుకునే సమయంలో కంపెనీ పూర్తి సమాచారం తెలుసుకోవాలని తెలిపారు. సిబ్బంది ఈ లోన్ యాప్స్, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులుగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజారెడ్డి, సిబ్బంది గంగాధర్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story