గాంధేయ మార్గం ఆదర్శం...అనుసరణీయం

by Disha Web Desk 20 |
గాంధేయ మార్గం ఆదర్శం...అనుసరణీయం
X

దిశ, నిజామాబాద్ సిటీ : గాంధేయ మార్గం అందరికి ఆదర్శం, అనుసరణీయమని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని గాంధీచౌక్ లో గల మహాత్మగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మేయర్ నీతూకిరణ్ మాట్లాడుతూ, అహింసా, సత్యాగ్రహంను ఆయుధంగా మల్చుకుని భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆదర్శనీయులు మహాత్మా గాంధీ అని గుర్తు చేశారు. అహింసా మార్గంలోనే సుదీర్ఘ పోరాటం చేసి ఆంగ్లేయులను పారద్రోలి దేశానికి స్వేచ్చా స్వాతంత్ర్యాలు సాధించి పెట్టారని కొనియాడారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచారణాత్మకంగా అమలు చేస్తూనే, ఇతరులకు వాటిని సూచించడం వల్లనే అవి ప్రపంచ వ్యాప్తంగా ఆచారణాత్మకం అయ్యాయని అన్నారు.

అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, భరతమాత తలరాతను మార్చిన విధాత మహాత్మాగాంధీ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమాల్లో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు రషీద్, సాజిద్, ముస్తాక్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed