అప్రోచ్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి..

by Disha Web Desk 20 |
అప్రోచ్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి..
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలో మామిడిపల్లి నుంచి గోవింద్ పేటకు వెళ్లే ఫ్లై ఓవర్, మామిడిపల్లి ఫ్లైఓవర్, అడివి మామిడిపల్లి వద్ద నిర్మించే ఫ్లై ఓవర్లకు కేంద్ర ప్రభుత్వం రూ. 67 కోట్లు కేటాయించి చురుకుగా నిర్మాణ పనులు కొనసాగిస్తుందని పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి నుంచి గోవింద్ పేటకు వెళ్లే మార్గంలో దక్షిణమధ్య రైల్వే ద్వారా ఎల్సీ నంబర్ వన్ స్థానంలో రూ.19 కోట్ల 80 లక్షలతో నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని బుధవారం ఎంపీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వచ్చేజూన్ లో అడవి మామిడిపల్లి, మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిలను ప్రారంభిస్తామన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేపనుల కోసం రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్న రాష్ట్రప్రభుత్వం నత్తనడకతో పనులు కొనసాగిస్తుందని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం ఈ పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో 15 ప్రాజెక్టు కింద 2004 కిలోమీటర్ల పరిధిలో రూ. 29వేల581 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయన్నారు. 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే కోసం రూ. 886 కోట్లు ఖర్చు చేస్తే, మోడీ ప్రభుత్వం రైల్వేస్ కింద రూ.4018 కోట్లు కేటాయించిందన్నారు. ఈ ఒక్క ఏడాదే రూ. 4,400 కోట్లు కేటాయించిందని తెలిపారు. 39 వరల్డ్ క్లాసు స్టేషన్స్ అమృత్ భారత్ స్టేషన్స్ స్కీంలు కేటాయిస్తే అందులో మన ప్రాంతానికి చెందిన బాసర, నిజామాబాద్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకు తెలంగాణలో 41 ఫ్లై ఓవర్లు ప్రారంభించామని, మామిడిపల్లిలో ప్రారంభించినది 412 వదన్నారు.

రైల్వేఎలక్ట్రిషన్ కింద 2014 వరకు అంటే స్వాతంత్రం వచ్చిన నాటికి 1967 కిలోమీటర్లు అయితే 8 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం 52వేల 247 కిలోమీటర్ల లైన్లు ఎలక్ట్రిషన్ చేశారన్నారు. 2014 కంటే ముందు రోజుకు 11.7 కిలోమీటర్లు నిర్మిస్తే ఈరోజు రోజుకు 38 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వ హాయంలో దేశవ్యాప్తంగా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు.

ఈ సభలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్, గోవింద్ పెట్ ఎంపీటీసీ సభ్యుడు యాళ్ల రాజ్ కుమార్, కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పాలెపు రాజు, బీజేపీ రాష్ట్రకార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆదిలాబాద్ బీజేపీ జిల్లా ఇంచార్జి అల్జాపూర్ శ్రీనివాస్, పుప్పాల శివరాజ్, ఆర్మూర్ మున్సిపల్ మాజీచైర్మన్ కంచెట్టి గంగాధర్, పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్, మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, నాయకులు ఉదయ్, రాజ్ కుమార్, రైల్వే అధికారులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



Next Story