అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

by Ratna Kumari |

ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య మంగళవారం ఆవిష్కరించారు.

అగ్నిమాపక వారోత్సవాల  కరపత్రాల ఆవిష్కరణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా అగ్నిమాపక అధికారి టి. పరమేశ్వర్, అగ్ని మాపక కేంద్రం అధికారి ఏ.శంకర్ లు పాల్గొన్నారు. వారం రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో చోట వారోత్సవాలను నిర్వహిస్తామని వారు తెలిపారు. ఏడాది నిర్ణయించిన జాతీయ నినాదం అగ్ని ప్రమాదాల నివారణ కోసం, సురక్షిత పాఠశాల, సురక్షితమైన ఆస్పత్రి, అగ్ని భద్రతతపై అవగాహన కలిగిన సమాజం అవసరం అనే నినాదంతో ప్రజల్ని చైతన్యవంతం చేయడం లక్ష్యంగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు జిల్లా అగ్నిమాపక అధికారి తెలిపారు.

Next Story