- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గల్ఫ్ బాధితుడికి 2లక్షలు రికవరీ చేయించిన కోటపాటి
దిశ, ఆర్మూర్ : మెండోరా మండలం వెల్కటూర్ గ్రామ యువకుడు వెంకటేష్ ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లాలని ఆలోచనతో

దిశ, ఆర్మూర్ : మెండోరా మండలం వెల్కటూర్ గ్రామ యువకుడు వెంకటేష్ ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లాలని ఆలోచనతో నందిపేట్ మండలంలోని ఒక సబ్ ఏజెంట్ ను సంప్రదించాడు. అయితే యువకుని ఆత్రుతను సొమ్ము చేసుకోవాలనే దుర్బుద్ధితో సదరు యువకుడిని విజిట్ వీసాతో రష్యాకు పంపించి మూడు లక్షల రూపాయలు వసూలు చేసినప్పటికీ అక్కడ సరైన ఉద్యోగం కానీ, అక్కడే ఉండి ఇతర పనులు చేసుకోవడానికి ధ్రువీకరణ పత్రాలు కానీ ఇప్పించక పోవడంతో అర్ధాంతరంగా 15 రోజులకే ఇంటికి తిరిగి వచ్చాడు. దిక్కు తోచని స్థితిలో ఆర్మూర్ లోని " ప్రవాస భారతీయులు సంక్షేమ వేదిక" అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడును సంప్రదించి తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపి సహాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్న కోటపాటి నకిలీ ఏజెంటును పిలిపించి గల్ఫ్ బాధితుడు వెంకటేష్ కు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించడంతో తప్పని పరిస్థితిలో తప్పు ఒప్పుకొని వెంకటేష్ ను రష్యా పంపించడానికి అయిన ఖర్చులు ఒక లక్ష రూపాయలు మినహాయించుకొని 2 లక్షలు తిరిగి చెల్లించడానికి ఒప్పుకొని సోమవారం చెల్లించినట్లు కోటపాటి చెప్పారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ఈమధ్య రష్యాలో నెలకు 70 వేల రూపాయలు జీతం అని చెప్పి మూడు లక్షలు వసూలు చేస్తున్న నకిలీ ఏజెంట్ల బారిన పడి తనలాగే ఎవరూ మోసపోవద్దని కోరారు. మోసపోయిన తనకు అండగా నిలబడి రెండు లక్షల రూపాయలు ఇప్పించిన కోటపాటికి సదా రుణపడి ఉంటానని ధన్యవాదాలు తెలిపారు.






