- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ లో చేరిన జనసేన పార్టీ నాయకులు
by Ratna Kumari |
జనసేన పార్టీ జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్, క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగంలు శనివారం టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

X
దిశ, కామారెడ్డి : జనసేన పార్టీ జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్, క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగంలు శనివారం టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో పాలుపంచుకోవడానికి పార్టీలోకి వస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జమిల్, కాంగ్రెస్ నాయకులు రంగ రమేష్ గౌడ్, బల్ల శ్రీనివాస్, అరుణ్, మెహర్ బాబా గౌడ్, శ్రీకాంత్ ఉన్నారు.
Next Story






