ఉద్యమం ఉధృతం చేస్తాం.. ఫీల్డ్ అసిస్టెంట్స్ హెచ్చరిక

by Disha Web Desk 4 |
ఉద్యమం ఉధృతం చేస్తాం.. ఫీల్డ్ అసిస్టెంట్స్ హెచ్చరిక
X

దిశ,ఇందల్వాయి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ ను అక్రమంగా అరెస్టులు చేయించడమేంటని జిల్లా నాయకులు జెగ్గ రాములు,ఈరామళ్ల రవిలు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉందని పోలీసులతో దౌర్జన్యంగా అరెస్ట్ లు చేయించడం బాధాకరమన్నారు. వారు ఫీల్డ్ అస్సిస్టెంట్సే కాదు అని అన్న సీఎం కెసీఆర్ ఇప్పుడెందుకు ఫీల్డ్ అసిస్టెంట్స్ ను అరెస్టులు చేయాలని ఆదేశాలు ఎందుకు జారీ చేశారని అన్నారు.14సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్స్ చాలీ చాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేయించుకున్నారన్నారు.చివరికి ఫీల్డ్ అసిస్టెంట్లను రోడ్డుపాలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు వున్న ఉద్యోగాలు పోయాయనే భయాందోళనతో,మనస్తాపంతో ౭౦ మంది మరణించారన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు.లేదంటే రాష్ట్రవ్యాప్తంగా 7651మంది కుటుంబాలతో సహా రోడ్లపైకి వస్తామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్స్ పైన సానుకూలంగా స్పందించి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎర్రమల్ల రవి,సంజీవ్, రవికుమార్,తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed