ఈ ముద్దుగుమ్మతో రొమాన్స్ చేయాలంటే స్టార్ హీరోలు కూడా భయపడేవారు.. ఆమె ఎవరంటే?

by Prasanna |
ఈ ముద్దుగుమ్మతో రొమాన్స్ చేయాలంటే స్టార్ హీరోలు కూడా భయపడేవారు.. ఆమె ఎవరంటే?
X

దిశ, సినిమా: సినిమాల్లో సరైన పాత్ర దొరికితే చాలా మంది హీరో హీరోయిన్లు తమను తాము నిరూపించుకుంటారు. కొందరైతే హీరోయిన్స్ హీరోలతో పోటీపడి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇప్పుడు చెప్పబోయే ముద్దుగుమ్మ కూడా స్టార్ హీరోలతో పోటీ పడి మంచి పేరు సంపాదించుకుంది. ఈమె కోసమే చాలా మంది సినిమాకి వెళ్లేవారు. నటనతోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంది. ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ.

ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు హీరోలతో కలిసి పనిచేసింది.1985లో భలే మిత్రులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. 1989లో వచ్చిన సూత్రధారులు సినిమా ద్వారా మంచినటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ మీద ఓ రూమర్ బాగా వైరల్ అవుతుంది.

రమ్యకృష్ణతో రొమాన్స్ చేయాలంటే స్టార్ హీరోలు కూడా భయపడేవారని సినీ పెద్దలు చెబుతున్నారు. షూటింగ్ సమయంలో హీరోలు రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఆమె మాములుగా ఉన్నా కూడా కోపంగా ఉన్నట్టు మొఖం కనిపించేదట.. దానితో హీరోలు కూడా చాలా టేక్స్ తీసుకునేవారని సన్నిహితులు చెబుతున్నారు. నరసింహ చిత్రంలో ' ‘నీలాంబరి’ పాత్రను పోషించి రజనీకాంత్‌తో పోటీ పడింది. ఈ సినిమాతో పెద్ద హిట్ అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో, బాహుబలి , రొమాంటిక్, లైగర్, రంగమార్తాండ, గుంటూరు కారం సినిమాలో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించింది.

Next Story

Most Viewed