ఠాగూర్ సీన్ రిపీట్.. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి యువకుడు బలి

by Rajesh |
ఠాగూర్ సీన్ రిపీట్.. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి యువకుడు బలి
X

దిశ నిజామాబాద్ సిటీ : ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యుల ధన దాహానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తరచుగా అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా నవీపేట్ మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన పిట్ట నారాయణ (36) అనే యువకుడు గుండె నొప్పితో నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం చేరారు. అయితే బాధితుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ వ్యక్తికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించిందని అయినప్పటికీ కూడా ఆసుపత్రి యాజమాన్యం వైద్యులు బాధితుని కుటుంబ సభ్యులతో ఆపరేషన్ చేయాలని ఆరోగ్యశ్రీ కాకుండా అదనంగా రూ. 80 వేల రూపాయలు చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆ తర్వాత 80,000 రూపాయలు చెల్లించిన అనంతరం గురువారం మధ్యాహ్నం నారాయణను ఆపరేషన్ నిమిత్తం తీసుకువెళ్లారు. ఆ తర్వాత వైద్యులు బాధితుని కుటుంబ సభ్యులతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయిందని తెలిపారని అన్నారు. ఆ తర్వాత తమకు అనుమానం వచ్చి బాధితుని చూపించాలంటూ వైద్యులకు ఆసుపత్రి సిబ్బందిపై ఒత్తిడి తేగా చూయించడానికి నిరాకరించారని వారు వెల్లడించారు. ఆ తర్వాత అప్పటికే చనిపోయిన నారాయణకు రక్తం ఎక్కించాలంటూ వైద్యులు కొత్త డ్రామాకు తెర లేపారని, తీరా చూస్తే నారాయణ మృతి చెందిన విషయం తెలిసిందని బాధితులు వాపోయారు. అయినప్పటికీ ఇంతవరకు నారాయణ మృతి చెందారు అనే విషయం కూడా కుటుంబ సభ్యులకు తెలపలేరని వారు పేర్కొన్నారు.

అంతేకాకుండా మృతదేహాన్ని కూడా తమకు అప్పగించలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యానికి వైద్యులకు నారాయణ మృతదేహాన్ని ఇవ్వమని కోరగా రైతుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని కష్టపరిహారం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని వైద్యులను కోరగా మేము ఎలాంటి నష్టపరిహారం ఇవ్వమని తమ వెనుక అధికారులు, పోలీసులు ఉన్నారని అధికారం కూడా తమ వద్ద ఉందని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారని బాధితుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం తమకు న్యాయం చేసే వరకు తమ ఆందోళన విరమించమని ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించిన బాధితుని కుటుంబ సభ్యులు ఆస్పత్రి నుండి సిపి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఆందోళన చేపట్టారు.

మృతదేహం తరలింపులో పోలీసుల అత్యుత్సాహం

నారాయణ మృతి చెందడంతో బాధితుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇక్కడైతే న్యాయం జరగదని సీపీ ఆఫీసుకు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుంది అని వారికి నచ్చ చెప్పారు. దీంతో బాధితులు తమకు న్యాయం జరగాలని ఆస్పత్రి నుండి సిపి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేస్తుండడంతో ఎవరూ లేరని విషయాన్ని గ్రహించి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. క్షణాల్లో ప్రవేట్ అంబులెన్స్ ను తీసుకువచ్చి బలవంతంగా మృతదేహాన్ని తరలించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

నారాయణ మృతి‌పై వివరణ ఇవ్వడానికి ఆసుపత్రి వైద్యులు ‘నో’

గుండెకు సంబంధించిన ఆపరేషన్‌తో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందిన నారాయణ మృతిపై వివరణ అడగడానికి ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా ఈ విషయంలో ఇప్పుడే ఎలాంటి వివరణ ఇవ్వలేమని మరికొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed