1000 మట్టి వినాయకుడి విగ్రహాల పంపిణీ

by velandi.Saikiran |

భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమానికి

1000 మట్టి వినాయకుడి విగ్రహాల పంపిణీ
X

దిశ, భిక్కనూరు: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమని ఎస్ఐ ఆంజనేయులు అన్నారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాల వలన, నీళ్లు కలుషితమై ఎన్నో జీవరాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.


అందుకే ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన విగ్రహాలనే పూజించాలని కోరారు. 1000 మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన భారతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, న్యాయవాది లింగాల రాజబాబు గౌడ్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ జేపీ సిద్దా గౌడ్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాటిపాముల లింబాద్రి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాటికొండ మల్లేశం, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు గంగెల్లి మధుసూదన్, అశోక్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story