ఛ‌లో ఖ‌మ్మం కి భారీగా త‌ర‌లిరండి సీపీఐ నేత రాములు

by Ratna Kumari |

ఛ‌లో ఖమ్మం కు తరలిరండి అని సీపీఐ నేత దుబాస్ రాములు పిలుపునిచ్చారు.

ఛ‌లో ఖ‌మ్మం కి భారీగా త‌ర‌లిరండి సీపీఐ నేత రాములు
X

దిశ, బాన్సువాడ : ఛ‌లో ఖమ్మం కు తరలిరండి అని సీపీఐ నేత దుబాస్ రాములు పిలుపునిచ్చారు. సీపీఐ ఆధ్వర్యంలో జనవరి18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు భారీగా తరలిరావాలని గురువారం బాన్సువాడ పట్టణంలోని సీపీఐ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ దుబాస్ రాములు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని ఆయన తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం లోని పార్టీ నాయకులు కార్యకర్తలు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు సభ్యులు అందరూ తరలిరావాలని ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేన్నంగారి సురేష్, పుట్టి సాయిలు, భూమయ్య, గంగాధర్, ఫతే ఖాన్ పాల్గొన్నారు.

Next Story