- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలి : ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి
దిశ ఆర్మూర్ : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకునేలా

దిశ ఆర్మూర్ : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకునేలా పాత, కొత్తతరం నాయకులు సమన్వయంతో కలిసి పని చేయాలని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకునేలా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని వినయ్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎంపీటీసీ స్థానాలకు ముగ్గురు చొప్పున పేర్ల జాబి తాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు రూపొందించాలని ఆదేశించారు. గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ కేటాయింపులో ప్రాధాన్య మిస్తామని పేర్కొన్నారు. నాయకులు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి ప్రకాష్, ఆలూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కెర విజయ్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్.కె. చిన్నారెడ్డి, డొంకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఇస్సపల్లి విట్టం జీవన్, ఆర్మూర్ పట్టణ మాజీ చైర్మన్ పండిత్ వినీత పవన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.






