ఉన్నత లక్ష్యాలను ఎంచుకోండి: నర్సింగరావు

by Disha Web Desk 11 |
ఉన్నత లక్ష్యాలను ఎంచుకోండి: నర్సింగరావు
X

దిశ, మాచారెడ్డి: పాఠశాల దశలోనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని ఆ దిశగా ప్రయత్నం చేయాలని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిషత్ అధ్యక్షుడు లోయపల్లి నర్సింగరావు సూచించారు. మాచారెడ్డి మండల పరిధి ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం 50 రోజులపాటు అల్పాహారం అందిస్తున్న దాత లోయపల్లి నర్సింగరావును విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఆందోళన చెందకుండా ఓ ప్రణాళిక ప్రకారం ఏకాగ్రతతో చదవాలని సూచించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కోరారు.

ఉపాధ్యాయులు అల్ఫాహారం కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంపీపీ కి డీఈఓ రాజు, ఎస్పీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మిణుకురి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ జీడిపల్లి నర్సింహారెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మద్దెల రాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed