రైతు అంటే జవాన్ తో సమానం.. ఎమ్మెల్సీ కవిత

by Disha Web Desk 20 |
రైతు అంటే జవాన్ తో సమానం.. ఎమ్మెల్సీ కవిత
X

దిశ, గాంధారి/సదాశివనగర్ : వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని శాసనసభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శాస్త్రి నగర్ మండలం పద్మాజివాడి ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచ్చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రైతు కులం జరుపుకునే పండుగ రైతు దినోత్సవం అని అంతేకాకుండా అదానీ, ప్రధాని, అంబానీలు మనల్ని మనరాష్ట్రాన్ని లక్షసార్లు కొనే సత్తా ఉన్న ఎంత కోటీశ్వరులైనా చివరికి రైతు పండించిన అన్నాన్ని తినాలి తప్ప పైసలు మాత్రం తినలేరని అన్నారు. తెలంగాణ రాకముందు 7 మెగావాట్లు ఉన్న కరెంటు ఇప్పుడు నాలుగు విధాలుగా గాలి, నీరు, సోలార్, బొగ్గు తెలంగాణ వచ్చిన తర్వాత 18 వేల మెగావాట్ల సాధించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని పోచారం ముక్తకంఠంతో తెలిపారు.

అంతేకాకుండా ప్రధాని పాలించే తన సొంత రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారని కానీ కేవలం దేశంలోనే 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ప్రధాని పరిపాలిస్తున్న గుజరాత్ రాష్ట్ర రైతులకు మీటర్లు పెట్టి బిల్లు కట్టించుకునే స్థితిలో ఉన్నారు. రైతులు రాజులు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని పోచారం కొనియాడారు. కేవలం ఒక్క ఎల్లారెడ్డిలోనే ఈ ఏడాది 20 లక్షల పదకొండువేల టన్నులు దాదాపు 3500 కోట్ల రూపాయలను దాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భాజపా, కాంగ్రెస్ లో రెండు పార్టీలు సీఎం కుర్చికోసం పోటీ పడడం తప్ప రైతుల గురించి ఆలోచించిన పాపాన పోలేరని అన్నారు. అంతేకాకుండా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ దేశంలో సైనికుల ఆవశ్యకత ఎంత ఉందో ఎండనక వాననక కంటిమీద కునుకులేకుండా పహార కాస్తుంటే ఇక్కడ మనం క్షేమంగా ఉన్నామని దేశానికి జవాన్ ఎంత ముఖ్యమో రైతు కూడా అంతే ముఖ్యమని జవాన్ తో సమానమని అన్నారు.

ఇంతకుముందు నకిలీ ధాన్యాలు నకిలీ మందులు నకిలీ విత్తనాలు తయారు చేసి రైతులను అప్పులలో ఉరివేసుకునే పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు నకిలీవి మందులు గాని విత్తనాలు కానీ అమ్మితే పీడియాట్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కవిత అన్నారు. మరి రైతుకు విత్తనాలు ఉంటే సరిపోదు అందుకే 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. రైతులు కలిసి ఉండాలి అందుకే రైతు వేదిక స్థాపింప చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కోట్లు దోచుకునే వారికి కాపాడే నాయకులు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చెక్ డ్యామ్ కోసమని 60 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసుకొని జగ్జీవన్ నిర్మించుకున్నామని అన్నారు అంతేకాకుండా కాలేశ్వరం కు 850 కోట్లు మంజూరయ్యాయని త్వరలోనే కాలేశ్వరం పనులు కూడా జరగబోతాయని తెలిపారు. అలాగే దురదృష్టవశాత్తు 1900 రైతులకు రైతు బీమా ద్వారా 95 కోట్లు ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

రైతు లాభదాయకమైన పంటలు వేయాలని రైతు ఉంటేనే రాజ్యమని రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు సింహాలుగా గర్జించి తెలంగాణ సాధించిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గజాల సురేందర్ మాట్లాడుతూ జిల్లాలో కామారెడ్డి మొక్కలు పండించే జిల్లాలో మొదటి స్థానంలో ఉందని అందుకు పట్టుకొమ్మలుగా గాంధారి సదాశివనగర్ ,తాడ్వాయి, లింగంపేట్, రైతుల ఫలితాన్ని ముందు స్థానంలో ఉందని కొనియాడారు. అంతేకాకుండా తండాలను గ్రామపంచాయతీలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రైతు చెడిపోతే వారం రోజుల్లో రైతు భీమా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీసేందుకే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. 9,000 మంది అగ్రికల్చర్ ఆఫీసర్లను తీసుకొని ప్రభుత్వంకు, రైతులకు వారధిగా ఉంటున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed