- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరికీ ఆమోదయోగ్యమైన రాష్ట్ర బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైనదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

దిశ, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైనదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. తాను సలహాదారుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ శాఖలకు తగిన బడ్జెట్ లో ప్రాధాన్యం లభించేలా ప్రయత్నం చేశానన్నారు. మైనార్టీ శాఖకు 3591 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 40232 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11405 కోట్లు, మూడు లక్షల నాలుగు వేల 965 కోట్లతో అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేసే విధంగా తెలంగాణ బడ్జెట్ ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగానికి పెద్ద పీట వేస్తూ 24439 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. స్త్రీ శిశు సంక్షేమానికి 2862 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు, విద్య రంగానికి 28108 కోట్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. వ్యవసాయ రంగానికి నీటిని అందించడానికి నీటిపారుదల శాఖకి 27373 కోట్లు కేటాయించి రైతు పక్షపాతి ప్రభుత్వంగా ముద్ర వేసుకున్నామన్నారు.
పట్టణాభివృద్ధి తో పాటు పల్లెల అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వారిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పలు పథకాలను ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీల అమలుకు దాదాపుగా రూ.56084 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తునట్లు తెలిపారు. ముఖ్యంగా రైతు భరోసా పథకానికి రూ.18 వేల కోట్లతో కలిపి ఒక్క వ్యవసాయ శాఖకే అత్యధికంగా రూ.43 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖకు రూ.21221 వేల కోట్లు, వైద్యశాఖకు రూ.12393 వేల కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు.






