సిద్ధుల గుట్ట‌పై 108 రోజుల్లో 108 గ్రామాల ధ్యాన కార్య‌క్ర‌మాలు

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్దులగుట్ట పై నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద రెండో పిరమిడ్ నవనాథ సిద్దేశ్వర

సిద్ధుల గుట్ట‌పై 108 రోజుల్లో 108 గ్రామాల ధ్యాన కార్య‌క్ర‌మాలు
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్దులగుట్ట పై నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద రెండో పిరమిడ్ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో 108 రోజులు 108 గ్రామాలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించనున్నట్లు నిజామాబాద్ పీఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు, న్యాయవాది సాయి కృష్ణారెడ్డి గురువారం తెలిపారు. ప్రతి రోజు ఒక గ్రామం నుంచి ఆ గ్రామానికి చెందిన ధ్యాన బంధువులు హాజరై సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల అఖండ ధ్యానం చేసి, కొత్తవారికి ధ్యానం గురించి, శాఖాహారం గురించి అద్భుతంగా వివరించారు. ఈనెల 19వ తేదీ ఆదివారం రోజున 108 రోజులు 108 గ్రామాల విజయోత్సవ సంబరాలను పత్రీజీ ధ్యాన మహా యాగం - 4 అవగాహన సదస్సును సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ధ్యాన, జ్ఞాన సాంస్కృతిక కార్యక్రమాలు విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరుగు తుందన్నారు. ఉదయం అల్పాహారం మధ్యాహ్నం ధ్యానమృతం అందజేయడం జరుగుతుందని, ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టు సభ్యులు, సీనియర్ మాస్టర్లు పాల్గొంటారని ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో హాజరై ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాయి కృష్ణ రెడ్డి కోరారు.

Next Story