- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిఫ్ట్ ఇరిగేషన్‌కు కొత్త సాంకేతిక మార్గదర్శకాలు
రాష్ట్రంలోని చిన్న, మధ్య స్థాయి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల రూపకల్పనలో ఏకరీతి ప్రమాణాలు, సాంకేతిక స్పష్టత తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ సలహాదారు కేపీ రెడ్డి రూపొందించిన సాంకేతిక మార్గదర్శక పుస్తకం తాజాగా విడుదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని చిన్న, మధ్య స్థాయి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల రూపకల్పనలో ఏకరీతి ప్రమాణాలు, సాంకేతిక స్పష్టత తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ సలహాదారు కేపీ రెడ్డి రూపొందించిన సాంకేతిక మార్గదర్శక పుస్తకం తాజాగా విడుదలైంది. లిఫ్ట్ ఇరిగేషన్ రంగంలో దశాబ్దాల అనుభవం, విస్తృత ఫీల్డ్ వర్క్‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ హ్యాండ్‌బుక్.. ఇంజినీర్లకు మార్గదర్శకంగా నిలవనుంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల రూపకల్పన, అమలులో ఎదురయ్యే సాంకేతిక లోపాలు, ప్రాక్టికల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని రూపొందించారు. తన వ్యక్తిగత అనుభవంతోపాటు సిబ్బందితో కలిసి చేసిన విస్తృత ఫీల్డ్ స్టడీలను సమీకరించి.. ఇంజినీర్లు నేరుగా ఉపయోగించుకునే విధంగా ఈ మార్గదర్శకాలను రూపొందించారు. మూడు విభాగాలుగా ఉన్న ఈ పుస్తకంలో అన్నిరకాల పంపింగ్ స్టేషన్లకు వర్తించే సాధారణ నియమాలు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల రూపకల్పన, పంప్ హౌస్, ఎలక్ట్రికల్ ఏర్పాట్లు మధ్య తరగతి లిఫ్ట్ పథకాల కోసం ప్రత్యేక సాంకేతిక మార్గదర్శకాలు సవివరంగా పొందుపరిచారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల రూపకల్పనలో కీలకమైన అంశాలకు సంబంధించి స్పష్టమైన సంఖ్యాత్మక ప్రమాణాలను ఈ పుస్తకం సూచిస్తోంది.






