రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం... నిలిచిపోయిన రాకపోకలు

by Dishanational1 |
రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం... నిలిచిపోయిన రాకపోకలు
X

దిశ, మిర్యాలగూడ: దొంగల బెడదతో రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించడంతో మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణ మానస కాలనీ.... కృష్ణా కాలనీల నడుమ మంగళవారం రాకపోకలు నిలిచి పోయాయి. వివరాలు పరిశీలిస్తే.... పట్టణంలోని కృష్ణ కాలనీ, కృష్ణ మానస కాలనీ(గేటెడ్ కమ్యూనిటీ)ల మధ్య 33 ఫీట్ల రోడ్డును మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రెండు కాలనీల నడుమ రాకపోకలతోపాటు నార్కట్ పల్లి-అద్దంకి ప్రధాన రహదారికి చేరుకోవడం సులభంగా ఉండేది.

అయితే కొద్ది రోజులుగా ఈ రెండు కాలనీలలో వరుస దొంగతనాలు జరిగాయి. ఈ రోడ్డు కారణంగా గుర్తుతెలియని వ్యక్తుల సంచారం పెరిగి దొంగతనాలు జరుగుతున్నాయని గేటెడ్ కాలనీ వాసులు ఆరోపిస్తూ రాత్రికి రాత్రే గోడ కట్టారు. రాకపోకలకు అనువైన రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం చేయడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్డును ఒక కాలనీ ప్రజల కోసం మూయడం సరికాదని, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయంపై కమిషనర్ రవీంద్ర సాగర్ ను వివరణ కోరగా టౌన్ ప్లానింగ్ అధికారులను విచారించవలసిందిగా సూచించినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed