- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో కట్టంగూరు యువతి మృతి..
సాధారణ వ్యవసాయ కుటుంబమే అయినప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళింది... చదువును పూర్తి చేసి ఉద్యోగం సాధించాలని కలలుగన్నది.. కలల ఊహల్లోనే ఆ యువతి అనుకోకుండా బ్లడ్ క్యాన్సర్ రూపంలో అనంత లోకాలకు చేరిన విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, నకిరేకల్ (కట్టంగూరు) : సాధారణ వ్యవసాయ కుటుంబమే అయినప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళింది... చదువును పూర్తి చేసి ఉద్యోగం సాధించాలని కలలుగన్నది.. కలల ఊహల్లోనే ఆ యువతి అనుకోకుండా బ్లడ్ క్యాన్సర్ రూపంలో అనంత లోకాలకు చేరిన విషాద ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు గత వారం రోజులుగా కన్నీరు మున్నీరై విలపించారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పందనపల్లికి చెందిన కొండి వెంకటరెడ్డి కూతురు కొండి ప్రియాంక రెడ్డి (25) ఉన్నత చదువుల కోసం రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళింది. అగ్రికల్చర్ ఎమ్మెస్సీ పూర్తి చేసి హాన్సవిల్లాలోని అలభామ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని సైతం పూర్తి చేసింది. ప్రస్తుతం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉంది. ఈనెల 5వ తేదీన గొంతు నొప్పి వస్తుందని తన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది.
వెంటనే అతను వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అక్కడ ఉన్నటువంటి ఓ ఆసుపత్రిలో ఇంజక్షన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు తగ్గకపోవడంతో పరీక్షలు చేయగా బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. ఏడవ తేదీన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స చేస్తుండగా బ్రెయిన్ డెడ్ అయి 8వ తేదీన చనిపోయింది. బుధవారం స్వగ్రామంలో ఆ యువతకి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన తెలియడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపించారు. తన కూతురు విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించి ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఆశపడితే ఈ విధంగా జరిగిందంటూ తన తల్లి రోధిస్తున్న తీరు చూసి ప్రతి ఒక్కరూ కండతడి పెట్టుకున్నారు. మేము కన్న కలలు విదేశాల్లోనే చెదిరిపోయాయని తండ్రి ఎంతో బాధగా రోదిస్తున్నారు. అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.






