కులవృత్తిదారులకు తప్పని ఇబ్బందులు..

by Disha Web Desk 20 |
కులవృత్తిదారులకు తప్పని ఇబ్బందులు..
X

దిశ, వలిగొండ : వెనుకబడిన తరగతుల (బీసీ) కులాలలో చేతివృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న కులాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు శ్రీకారం చుట్టిన విషయం విధితమే. ఈనెల 6 నుండి 20వ తారీకు వరకు మీసేవ ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించినది. కులం, ఆదాయం ధ్రువీకరణపత్రాలు అవసరం కావడంతో పత్రాల మంజూరి కై తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించవలసి వస్తుంది. కానీ అక్కడ సర్వర్ సమస్య తలెత్తడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్తం సర్వర్ ప్రాబ్లం రావడం, గడువు దగ్గర పడుతుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం సమస్య తెలుసుకొని గడువు పొడిగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

సర్వర్ సరిగ్గా పనిచేయక పోవడంతో ఇబ్బందులు..

మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోవడానికి లబ్ధిదారులు బారులు తీరారు. సర్వర్ ప్రాబ్లం తో పడిగాపులు కాస్తున్నారు. నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 5000 దరఖాస్తులు నమోదు అయ్యాయి. నాలుగు రోజులు సమయంలో సర్వర్ సక్రమంగా పనిచేస్తే రెండు నుండి మూడు వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. కాగా తహసీల్దార్ గణేష్ నాయక్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒక ఆపరేటర్ ను ప్రత్యేకంగా నియమించారు. ఆదాయ ధృవీకరణ పత్రాలు వెంటనే అందజేస్తున్నామని తెలిపారు. సర్వర్ పని చేస్తే సమస్య తీరుతుందని. సర్వర్ ప్రాబ్లంతో 20 నుండి 30 నిమిషాలకు ఒక సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడానికి పడుతుందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు.

Next Story

Most Viewed