నువ్వు లేకుండా ఇదే తొలిసారి.. చాలా మిస్ అవుతున్నా.. బేబీ నిర్మాత ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 6 |
నువ్వు లేకుండా ఇదే తొలిసారి.. చాలా మిస్ అవుతున్నా.. బేబీ నిర్మాత ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస్ కుమార్ అలియాస్ ఎస్‌కెఎస్ ఇటీవల బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఫుల్ పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం ఆయన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తూ ఆసక్తికర పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఎస్‌కెఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశరావు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

నేడు ఆయన జయంతి కావడంతో ఎస్‌కెఎన్ తండ్రిని గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ఈ రోజు నాన్న పుట్టిన రోజు నాన్న లేకుండా తొలిసారి. ఇంకొన్ని రోజులు నాతోనే ఉండి ఉంటే బాగుండేది. కనీసం వెళ్ళిపోతారు అని తెలిసిన ఇంకా ఎన్నో మాట్లాడేవాడిని. నాన్నతో చెప్పాల్సింది చాలా మిగిలే ఉంది అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ అసలు నచ్చడం లేదు. ఎవరి మీద ఈ కోపం తీర్చుకోవాలో కూడా తెలియదు. ఇప్పుడు నాన్న నీకు నా ఫీలింగ్స్ తెలుస్తాయో లేదో తెలియదో.. నా మాటలు రీచ్ అవుతాయో లేదో కూడా తెలియదు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలా చాలా మిస్ అవుతున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు.

Next Story

Most Viewed