వారి కోసం జీవితాన్నే త్యాగం చేసిన కోవై సరళ..పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటంటే?

by Disha Web Desk 8 |
వారి కోసం జీవితాన్నే త్యాగం చేసిన కోవై సరళ..పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటంటే?
X

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో కమెడీయన్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం, కోవై సరళ. చాలా తక్కువ మంది మాత్రమే కమెడియన్‌గా మంచి పేరు సంపాదిస్తారు. అందులో కోవై సరళ ఒకరు. ఏ సినిమాలోనైనా సరే బ్రహ్మానందం ఉన్నాడంటే పక్కన ఈ నటి ఉండాల్సిందే. ఈ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ హీరోకు సైతం ఉండకపోవచ్చు ఆ రోజుల్లో అంటారు కొందరు. ఎందుకంటే ఈ కపుల్ అంత ఫేమస్. వీరిద్దరు సినిమాలో ఉన్నారంటే ఆ సినిమా సూపర్ హిట్టేనంట. సరళ తన కామెడీతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక ఎంతో మందిని నవ్వించిన ఈ నటి నిజ జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

కోవై సరళ ప్రస్తుతం ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. దీంతో ఈ నటి తన భర్త, పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతుంది కావచ్చు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. 62 ఏళ్ల వయసు వచ్చినా ఆమె పెళ్లికి దూరంగా ఉంది. దానికి గల అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తన కుటుంబంలో కోవై సరళ నే పెద్ద. ఈమెకి నలుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అయితే వారి ఫ్యామిలీ చాలా పేద కుటుంబం. ఈమె సంపాదించేది. దీంతో సరళ సినిమాల్లోకి వచ్చి బాగానే సంపాదించింది. కానీ అది తన స్వార్థం కోసం కాకుండా తన నలుగురు అక్క చెల్లెలకు పెళ్లి చేసి, వారి పిల్లల బాగోగులు కూడా ఈమే చూసుకుంటుంది. తన తోబుట్టువుల కోసం, వారి పిల్లల కోసం ఈ నటి తన జీవితాన్నే త్యాగం చేసింది. దీంతో ఇది విన్న తన అభిమానులు సరళది చాలా గొప్ప మనసు. ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు, శభాష్ సరళ అంటూ ప్రశంసిస్తున్నారు.

Next Story

Most Viewed