హాస్టల్ గోడ కూలి పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

by Disha Web Desk 1 |
హాస్టల్ గోడ కూలి పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
X

సూర్యాపేట భవిత కళాశాలలో ఘటన

దిశ, సూర్యాపేట ప్రతినిధి: తమలాగే తమ పిల్లలు కష్టపడొద్దు, చదువుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదని నమ్మిన తల్లిదండ్రుల ఆశలను కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్థాయి వసతి గృహాల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి.వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా ఆందోళనకు గురి చేస్తున్నారు. సకల సౌకర్యాలు కల్పిస్తామని మొదట్లో చెప్పి హాస్టల్లో చేరిన తర్వాత సరైన సదుపాయాలు కల్పించక పోగా అదనంగా డబ్బు వసూలు చేస్తూ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అభం శుభం తెలియని పదిమంది విద్యార్థులు క్షణాల్లో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం సూర్యాపేట భవిత కాలేజీ హాస్టల్లో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డు పక్కన ఉన్న భవిత కాలేజీలో ఆదివారం సాయంత్రం విద్యార్థులు స్టడీ హవర్ కి హాజరయ్యారు. కొద్దిసేపు విరామ సమయం ఇవ్వడంతో విద్యార్థులు మెట్ల గోడపై నిలబడ్డారు. హాస్టల్ భవనం పాత కాలంది అవడంతో ఒకేసారి మెట్ల గోడ కూలిపోయి పదిమంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన విద్యార్థులను ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అధికారుల పర్యవేక్షణ లేకనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed