కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయాడు: రాజగోపాల్ రెడ్డి

by Dishanational1 |
కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయాడు: రాజగోపాల్ రెడ్డి
X

దిశ, ఆత్మకూరు(ఎం): కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయిన తెలంగాణా ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. అందువల్ల బీజేపీ వైపు, మోడీ వైపు చూస్తున్నారని అన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని, వందమంది ఎమ్మెల్యేలతో అవినీతి డబ్బుతో దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా మునుగోడు బీఆర్ఎస్ గెలిచిందని కానీ మునుగోడులో నైతికంగా గెలిచింది మాత్రం బీజేపీ పార్టీయేనని అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాస్త ఆలోచించి మాట్లాడాలని బీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ తో వ్యాపారాల కోసం, వ్యక్తిగత పదవుల కోసం కుమ్మక్కు అయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా నాయకత్వ లోపం వల్ల జాతీయ స్థాయిలో బలహీనపడిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది బీఆర్ఎస్ కు వేసినట్టే అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. తెలంగాణాలో కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని, గణతంత్ర దినోత్సవం జరపకపోవడం అంటే అంబేడ్కర్ ను, రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని అన్నారు. గవర్నర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన దుర్మార్గుడు, చదువురాని దద్దమ్మ పాడి కౌశిక్ రెడ్డి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు చూస్తే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో అర్ధం అవుతుందని.. కావున తెలంగాణా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని రాబోయే రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చుకున్న కేసీఆర్ కి చివరికి వీఆర్ఏస్ గా మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.


Next Story

Most Viewed