కాంగ్రెస్‌ పార్టీని వీడినందుకు బాధగా ఉంది: Raja Gopal Reddy

by Dishanational1 |
కాంగ్రెస్‌ పార్టీని వీడినందుకు బాధగా ఉంది: Raja Gopal Reddy
X

దిశ, చండూరు: తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది కేవలం మునుగోడు ప్రాంత ప్రజల అభివృద్ధి కోసమేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేటలోని బి. ఆర్. సి. ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం చేయాలంటే మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను రాజీనామా చేశానని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లినప్పటికీ, కొంత బాధ ఉన్నా ఈ మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి సాధ్యమని ఆయన అన్నారు. నన్ను ఓడించడానికి దమ్ము లేక తనపై పోస్టర్లు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించాలి అంటే బీజేపీ కార్యకర్తలు సైనికులలాగా పనిచేయాలన్నారు. ఈ ఉప ఎన్నికల్లో మునుగోడు గడ్డమీద కాషాయ జెండా ఎగురవేయడం ఖాయం అని అన్నారు. కేసీఆర్ ఎన్ని కుతంత్రాలు, కుట్రలు చేసినా మునుగోడు ప్రాంత ప్రజలు బీజేపీని గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పలు పార్టీలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో బీజేపీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ సమన్వయకర్త ఎరేడ్ల శ్రీనివాస్ రెడ్డి, కాసాల జనార్దన్ రెడ్డి, పల్లె వెంకన్న, దోటి వెంకన్న యాదవ్, కోమిటి వీరేశం, కావలి అంజనేయులు, అన్నెపర్తి యాదగిరి, కోడి శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకన్న యాదవ్, సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బ నబోయిన లింగయ్య యాదవ్, చండూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అనంత మంగమ్మ గిరిధర్, కట్ట బిక్షం, ఎంపీటీసీలు చేపూరి యాదయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచులు తిప్పర్తి దేవేందర్, సాపిడి రాములు, వెంకట్ రెడ్డి, ఓంకారం, సుభాష్, కురుపాటి రాములమ్మ, సైదులు, నర్సిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు భూతరాజు వేణు, అయితరాజు మల్లేష్, రాజశేఖర్, సతీష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed