కరాటే పోటీల్లో.. కోకో ఖాన్ క్లబ్ విద్యార్థుల ప్రతిభ

by Bhanu |

ఖమ్మం పట్టణంలో ఆదివారం సుమన్ ఫోటో ఖాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 30వ నేషనల్ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో కోదాడ శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన కోకో ఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. క్లబ్‌కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరచి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నట్లు కోచ్ మాధవి లత తెలిపారు.

కరాటే పోటీల్లో.. కోకో ఖాన్ క్లబ్ విద్యార్థుల ప్రతిభ
X

దిశ, కోదాడ: ఖమ్మం పట్టణంలో ఆదివారం సుమన్ ఫోటో ఖాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 30వ నేషనల్ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో కోదాడ శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన కోకో ఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. క్లబ్‌కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరచి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నట్లు కోచ్ మాధవి లత తెలిపారు. క్లబ్ నుండి నిహార్, నిశాంత్, నోహిత్, ఈశ్వర్, అంజలి, శిరీష గోల్డ్ మెడల్స్ సాధించగా.. గుణ సాయి, విజయ, రవళి సిల్వర్ మెడల్స్ అందుకున్నారు. అలానే విక్రాంత్, వెంకట నిహాల్, నికిత బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలను సినీ నటుడు సుమన్, తెలంగాణ జూడో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జల్లెల శ్రీనివాసరావు అందజేసి, విద్యార్థులను అభినందించారు. కోదాడ ప్రాంతంలోని విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందిస్తూ.. జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తున్న కోచ్ మాధవి లత సేవలను పలువురు ప్రశంసించారు. జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన విద్యార్థులను కోదాడలో స్థానికులు అభినందించారు.

Next Story