కన్నుల పండుగగా పెద్దమ్మ తల్లి జాతర

by Dishanational1 |
కన్నుల పండుగగా పెద్దమ్మ తల్లి జాతర
X

దిశ, నాగార్జునసాగర్: మండలంలోని పినవూర గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే పెద్దమ్మ తల్లి జాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. పూజారులు ఉదయం ఆలయం వద్ద హోమం నిర్వహించి, అనంతరం అమ్మవారి కల్యాణం జరిపించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. మహిళలు నృత్యాలు చేస్తూ ప్రభలతో తరలి వచ్చారు.

జాతరలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందూరు జై వీర్ రెడ్డి, నలగొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని పెద్దమ్మ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతరకు పెద్దవూర, పీఏపల్లి, తిరుమల గిరిసాగర్, మల్లెపల్లి మండలాల నుంచే కాక సూర్యాపేట, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు, కృష్ణా జిల్లాలో నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు, ప్రజలు భారీగా వచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ అన్నిరకాలుగా వసతులు కల్పించారు. గిరిజనుల ఆరాధ్య దైవం అయిన పెద్దమ్మ తల్లికి గిరిజన మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కసిరెడ్డి అనిత మేఘశ్యామ్ రెడ్డి, బాణావత్ శంకర్ నాయక్, రాజా రమేష్, పాండు నాయక్, నడ్డి లింగయ్య, కిషన్, భీకోజి, రమావత్ రవి నాయక్, తేర మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed