బీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచుకున్న మునగాల ఎంపీపీ..

by Dishanational4 |
బీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచుకున్న మునగాల ఎంపీపీ..
X

దిశ, కోదాడ టౌన్: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నారని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మునగాల ఎంపీపీ యలక బిందు నరేందర్ రెడ్డి, సర్పంచులు రమణ వీరారెడ్డి, ఎంపీటీసీ మెట్టగడపు గురుజా, మాజీ కో ఆప్షన్ సభ్యులు రషీద్, గ్రామ శాఖ అధ్యక్షులు చెవుల నరేందర్, ఎలక గోపిరెడ్డి, ఉపసర్పంచ్ గండు జ్యోతి, రెండు వందల మంది కార్యకర్తలు ఎమ్మెల్యే బొల్లం సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాయకులకు గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఇతర పార్టీల నుంచి ఆగకుండా వలసలు కొనసాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని, కొత్త పాత తేడా లేకుండా అందర్నీ సమానంగా చూసే పార్టీ ఒక్క బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని.. కేసీఆర్ నాయకత్వంలో అందరూ పని చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఎవరు అధైర్య పడొద్దని అందరూ పార్టీ కోసం కలిసికట్టుగా పని చేయాలని కోరారు.

గ్రామాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, జెడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ రావు, ఎంపీపీ కవిత రాధా రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, పార్టీ మండల నాయకులు, ముఖ్య నాయకులు, రైతు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed