రేపటి నుండి ప్రారంభం కానున్న దేహదారుఢ్య పరీక్షలు

by Dishanational1 |
రేపటి నుండి ప్రారంభం కానున్న దేహదారుఢ్య పరీక్షలు
X

దిశ, నల్లగొండ: రేపటి నుండి ప్రారంభం కానున్న దేహదారుఢ్య పరీక్షలకు నేడు జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియం నందు అభ్యర్థులకు ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ /ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్దులు హల్ టికెట్ లో ఉన్న సూచనలు తప్పక పాటించాలన్నారు. రోజు ఉదయం మొదటగా వచ్చిన వారికి సీరియల్ గా టోకెన్లు జారీ చేసి మెయిన్ గేట్ నుండి లోపలికి పంపించడం జరుగుతుందన్నారు. మెయిన్ గేట్ వద్ద ఉన్న పోలీస్ అధికారులకు అడ్మిట్ కార్డ్/ఇంటిమేషన్ లెటర్ చూపించాలి, తదుపరి అభ్యర్థులకు వెరిఫికేషన్ చేయబడును, తరువాత బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్, తరువాత రిస్ట్ బ్రాండ్ వేసిన తరువాత, హోల్డింగ్ ఏరియాకు పంపించడం జరుగుతుందన్నారు.

అక్కడ నుండి RFID రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెంబర్ ఉన్న జాకెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. తరువాత మహిళా అభ్యర్థులకు 800 మీటర్స్ పురుష అభ్యర్థులకి 1600 పూర్తయిన తర్వాత క్వాలిఫై అయిన అభ్యర్థులను ఎత్తు, లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ పూర్తయిన అభ్యర్థులను ఫైనల్ రిజల్ట్ ఏరియాకు తీసుకుని వెళ్లి ఫైనల్ రిజల్ట్ షీట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. తదుపరి ఎగ్జిట్ నుండి బయటకు పంపించడం జరుగుతుందన్నారు.

అభ్యర్థులు ఒక్కసారి లోపలికి వచ్చిన తరువాత మొత్తం ఈవెంట్స్ అయిపోయిన తరువాత మాత్రమే బయటకు అనుమతిస్తారన్నారు. కాబట్టి అందుకు సిద్ధంగా రాగలరని అన్నారు. అనంతరం ప్రతి ఈవెంట్ వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ అధికారులకు సిబ్బందికి అభ్యర్థులకు ఏటువంటి అసౌకర్యం కలుగకుండా తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద రావు, డీఎస్పీలు నరసింహరెడ్డి, రమేష్, వెంకటగిరి, సురేష్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, డి.పి.ఓ సిబ్బంది, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టెక్నికల్ టీమ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed