వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

by Naveena |

రాజపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ బొల్లారం నర్సమ్మ (55) గురువారం సాయంత్రం మృతి చెందారు.

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
X

దిశ,రాజపేట: రాజపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ బొల్లారం నర్సమ్మ (55) గురువారం సాయంత్రం మృతి చెందారు. ఎప్పటిలాగే భర్త ఎల్లయ్య నరసమ్మలు ఉపాధి కూలీ పని చేసేందుకు వెళ్లి ఇంటికి వచ్చిన నర్సమ్మ మంచినీళ్లు తాగి కుప్పకూలిపోయింది. ఆపస్మారక స్థితికి చేరుకున్న నరసమ్మను హుటా హుటిన రాజపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సదరు డాక్టర్ సూచనల మేరకు రాజపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నరసమ్మ మృతి చెందింది. నరసమ్మ ఎల్లయ్యల కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలుండగా.. దళిత కుటుంబానికి చెందిన వారు పేదరికంలో కొట్టుమిట్టాడుతూ పూర్తిగా కూలి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి తక్షణమే సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story