దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా కోమటికుంట, కిష్టాపురం

by Web Desk |
దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా కోమటికుంట, కిష్టాపురం
X

దిశ, నేరేడుచర్ల: తెలంగాణ ప్రభుత్వం దళితుల ఆర్థిక అభివృద్ధి మెరుగు పరిచేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడతగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 దళితుల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో 100 మంది దళితులను ఎంపిక చేస్తారు. అందులో బాగంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పాలకవీడు మండలంలోని కోమటికుంట గ్రామంలో 33 కుటుంబాలు అలాగే చింతలపాలెం మండలం లోని క్రిష్టాపురం గ్రామంలో 67 కుటుంబాలను ఎంపిక చేశారు.

దీనిపై బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉన్నతాధికారులతో చర్చించారని సమాచారం. ఎంపీడీవో, ఎమ్మార్వో, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్ వాడి టీచర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. గతంలో చేసిన లబ్ధిదారుల ఎంపిక సరైందేనా.. అని ప్రజాప్రతినిధులతో చర్చించి అధికారులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా ఉందో లేదో చూడాలని ఆదేశించడం జరిగింది చేప్పారు. అందులో భాగంగా భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు పరిశీలనలు నిర్వహించారు. ఈ సర్వేలకు పరిశీలకులుగా జడ్జ్ సీఈఓ సురేష్ ను నియమించారు.



Next Story

Most Viewed