ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు.. తొలగిస్తే కఠిన చర్యలు

by Disha Web Desk 20 |
ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు ఏర్పాటు.. తొలగిస్తే కఠిన చర్యలు
X

దిశ, భూదాన్ పోచంపల్లి : గత కొన్ని రోజులుగా అఖిలపక్షం, వివిధ ప్రజాసంఘాల నాయకులు ప్రజలు, ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వస్తున్న ఆరోపణల ఆందోళన నేపథ్యంలో శనివారం మున్సిపల్ అధికారులు స్పందిస్తూ చర్యలు చేపట్టారు. మున్సిపల్ పరిధిలోని శ్రీ మిత్ర టౌన్షిప్ వెంచర్లో ఒక భాగమైన సాయి సౌధ లే అవుట్లో ప్రభుత్వానికి కేటాయించిన వివాదాస్పదంగా మారిన పదిశాతం భూమిలో ఈ భూమి ప్రభుత్వానిదే అని తెలిసేలా బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో ఈ స్థలం మున్సిపాలిటీకి చెందినదని గతంలో ఇదే స్థలంలో బోర్డును ఏర్పాటు చేస్తే దుండగులు దాన్నితొలగించారని ఇప్పుడు మళ్ళీ ఎవరైనా బోర్డును తొలగిస్తే మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రభుత్వ భూమి మీద ఎవరైనా లావదేవీలు జరిపిన రిజిస్ట్రేషన్ చేసుకున్న మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.


Next Story

Most Viewed