భారతీయ హస్తకళలు అద్భుతం: ఐర్లాండ్ దేశస్తురాలు మౌరీన్ గిల్బర్ట్

by Disha Web Desk 11 |
భారతీయ హస్తకళలు అద్భుతం: ఐర్లాండ్ దేశస్తురాలు మౌరీన్ గిల్బర్ట్
X

దిశ, చౌటుప్పల్: భారతీయ హస్తకళలు అద్భుతమని ఐర్లాండ్ దేశానికి చెందిన మౌరీన్ గిల్బర్ట్ ప్రశంసించారు.

చౌటుప్పల్ మండలం మల్కాపురం టెక్ట్స్ టైల్ పార్కులోని మినీ క్రాఫ్ట్స్ ను జొంటీ బృందం సభ్యురాలు పౌలోమితో కలిసి శుక్రవారం సందర్శించారు. ఫ్యాషన్ డిజైనర్ కే. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాతిక్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్లను వారు పరిశీలించారు. వస్త్రాలపై ప్రింటింగ్ చేసే పద్దతులను పరిశీలించారు. పురాతన కాలం నాటి హస్తకళలకు పునరుజ్జీవం పోయడానికి కృషి చేస్తున్నందుకు అభినందించారు. మినీ క్రాఫ్ట్స్ నిర్వాహకురాలు పుష్పలత వారిని హస్త కళలతో ముద్రించిన శాలువాతో సన్మానించారు.



Next Story