ఎన్‌కాస్ నిధులు గోల్ మాల్

by Disha Web Desk 12 |
ఎన్‌కాస్ నిధులు గోల్ మాల్
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో భారీగా ఎన్‌కాస్ నిధులు గోల్ మాల్ అయినట్లు తెలుస్తోంది.అసలు ఎన్ కాస్ అంటే ఏమిటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా...? అవును ఇది ఎవరికి దీని మీద అవగాహన లేకపోవడమే నిధులు గోల్ మాల్ కావడానికి కారణం అని తెలుస్తోంది. దీనిలో జరిగిన అవినీతి ఏంటో తెలుసుకుందాం అలాగే ఎన్ కాస్ గురించి కూడా తెలుసుకుందాం. ఎన్ కాస్ అంటే నేషనల్‌ క్వాలిటీ అసురెన్స్‌ సర్టిఫికెట్‌. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దేశం లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా పని చేస్తూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఒకే రకమైన వైద్య సేవలు అందించాలనేది దీని ముఖ్య లక్ష్యం.

అసలేం జరుగుతుంది..

నల్లగొండ జిల్లాలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,180 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.అయితే ఈ ఎన్ కాస్ కి మాత్రం ఇప్పటి వరకు 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేములపల్లి, శాలిగౌరరం, చిట్యాల,తిప్పర్తి నాంపల్లి, కొండ మల్లెపల్లి,చందంపేట,దామరచర్ల ఎంపిక అయ్యాయి. ఒక్కో సెంటర్ కి మొదటగా వాటి మౌలిక వసతుల కల్పన కోసం సుమారు 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఎంపిక అయ్యాక ప్రతి ఏడాది 3 లక్షల రూపాయలు అలా మూడు సంవత్సరాలు ఇస్తారు అంటే సుమారు 9 లక్షలు రూపాయలు ఇస్తారు.

ఎన్ కాస్ నిధులు గోల్ మాల్

ఎన్‌కాస్‌కి జిల్లాలో ఒక వైద్య అధికారి కో-ఆర్డినెటర్ గా వ్యవహరిస్తారు. ఈ తతంగం అంత ఆయన చేతుల మీదుగా కొనసాగుతుంది.ఇప్పటి వరకు ఎంపికైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎన్ కాస్ స్టాండర్స్ ద్వారా ఉండవలసిన వసతుల కల్పనకు కావాల్సిన వస్తువులు ఎక్కడ కూడా సరిగ్గా లేవు . వేములపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్,వెస్ట్రన్ టాయిలెట్స్ లేవు.నాంపల్లి లో సెంట్రిఫ్యూజ్ మిషన్స్, వెస్ట్రన్ టాయిలెట్స్ లేవు .ఇలా ఉండవలసిన అన్ని వసతులు, వస్తువులు ఏవి సరిగా ఉండవు. ఎన్ కాస్ కి ఎంపికైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎంక్వైరీ కి వచ్చే కమిటీ వివిధ రాష్ట్రాల ద్వారా వస్తారు.

వారు వచ్చినప్పుడు అవి ఉంటాయి. తర్వాత మాత్రం ఏమి ఉండవు.అలాగే ఒక్కసారి ఎంక్వయిరీ కి వచ్చిన టీం మళ్లీ రాదు కాబట్టి ఇక్కడ ఎన్ కాస్ ఆడిందే ఆట గా ఉంది. రికార్డులు రాపించడం మాత్రం అక్కడ స్థానిక ఆరోగ్య కేంద్రాల తో కానీ ఎన్ కాస్ కి టీం వచ్చినప్పుడు మాత్రం వారికి అనుకూలంగా వారికి విషయాలు తెలిపే వారిని మాత్రమే వేరే సిబ్బందిని ఇక్కడ పెట్టుకోవడం చర్చనీయాంశంగా ఉంది. అలాగే సిబ్బందికి అలాగే ఆశ వర్కర్లను కూడా ఈ విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాటాలుగా వెళుతోంది అని అనుమానాలు

ఎన్ కాస్ ద్వారా వచ్చే నిధులు ఎంపిక అయిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సుమారు 25% ప్రతి ఏడాది ఇవ్వాల్సి ఉన్నది. కానీ అది వారికి ఇవ్వడం లేదు కదా కనీస అవగాహన కూడా కల్పించడం లేదు.ఆ నిధులు అన్ని కూడా వాటాలు గా ఉన్నత వైద్య అధికారులకు వెళ్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ డిపార్ట్మెంట్ నిధులు ద్వారా వస్తువులు కొనుగోలు చేసి ఎన్ కాస్ ద్వారా కొన్నట్లు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రజా ప్రతినిధులకు లేని కనీస అవగాహన లేదు

మండలాల్లో జన ఆరోగ్య సమితి పేరునా మండల ప్రజా పరిషత్ ఎంపీపీ అధ్యక్షులు గా ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే నిధులు మీద పర్యవేక్షణ చేస్తారు.కనీస మౌలిక వసతుల కల్పన వాటి ద్వారా చేస్తారు.కానీ ఈ ఎన్ కాస్ ద్వారా వచ్చే నిధులు వాటి విధులు వివరాలు మాత్రం.అంత గోప్యంగా ఉంది ఇకనైనా ప్రజా ప్రతినిధుల కూడా ఈ నిధుల మీద పర్యవేక్షణ కలిగి ఉండాలని పలువురు కోరుతున్నారు.

అధికారులు దాడులు చేస్తే నిధులు గోల్ మాల్ బట్టబయలు అయ్యే అవకాశం

నల్లగొండ జిల్లాలో ఎన్ కాస్ నిధులు గోల్ మాల్ అయినట్లు తెలుస్తోంది.ఏక కాలంలో దాడులు చేస్తే నిజాలు బట్టబయలు అవుతుంది వారు ఖర్చు చేసిన నిధులు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ డిపార్ట్మెంట్ నిధులు ఖర్చు చేసారా లేక ఎన్ కాస్ నిధులు ఖర్చు చేశారో తెలిసే అవకాశం ఉంది. కానీ జిల్లా స్థాయి అధికారులకు కూడా ఇందులో వాటా వెళ్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కావున రాష్ట్ర స్థాయిలో వైద్య అధికారులు వీటి మీద నిఘా పెట్టి ఏక కాలంలో దాడులు చేస్తే వీరు చేసే అవినీతి బట్ట బయలు అవుతుంది.

నేను ఛార్జ్ తీసుకుని కొన్ని నెలలు అవుతుంది

నేను ఎన్ కాస్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకుని కొన్ని నెలలు అవుతుంది.ప్రభుత్వ ఆసుపత్రులను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఎన్ కాస్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రిల మాదిరిగా వైద్య సేవలు అందించడమే లక్ష్యం గా అంతా పారదర్శకంగా పనిచేస్తున్నామని అన్నారు. అలాగే ఏమైనా మౌలిక వసతులు కావాలి అంటే స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రెక్చర్ కార్పొరేషన్ ద్వారా అలాగే పంచాయతీ రాజ్ అపార్ట్మెంట్ ద్వారా పనులు చేస్తున్నట్లు తెలిపారు.:-డా,రాజేష్ జిల్లా ఎన్ కాస్ కో ఆర్డినెటర్:

Next Story

Most Viewed