అదృష్టం అంటే ఇదే కదా.. లాటరీలో 10 వేల కోట్లు గెలుచుకున్న క్యాన్సర్ బాధితుడు

by Disha Web Desk 12 |
అదృష్టం అంటే ఇదే కదా.. లాటరీలో 10 వేల కోట్లు గెలుచుకున్న క్యాన్సర్ బాధితుడు
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో డబ్బు ఉంటేనే ఎదైన సాధించగలమి ప్రజలు నమ్ముతారు. దీనికోసం నిరంతరం శ్రమించే వారు ఉంటారు. ఈజీ మనీ కోసం దొంగ దారులు తొక్కే వారు ఉంటారు. కానీ కొందరికి మాత్రం లక్ కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోతుంటారు. సరిగ్గా ఇలానే ఓ వ్యక్తికి జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 వేల కోట్లు లాటరీలో వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాకు చెందిన చెంగ్ సైఫాన్ అనే అతను గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాదితో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం అతను తన భార్య, స్నేహితుడితో కలిసి 20 లాటరీ టికెట్లు కొన్నాడు. ఏప్రిల్ నెలలో ఈ లాటరీ లకు సంబంధించిన డ్రా తీయగా.. సైఫాన్ ను జాక్ పాట్ విజేతగా ప్రకటించారు. ఈ జాక్ పాట్ ద్వారా అతనికి 1.3 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో అక్షరాల 10,930 కోట్లు గెలుచుకున్నాడు. కాగా ఈ లాటరీలో వచ్చిన డబ్బును అతను తన స్నేహితుడితో కలిసి పంచుకుంటానని మీడియాతో చెప్పుకొచ్చాడు.

Next Story