ధరిత్రిని కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ..

by Disha Web Desk 20 |
ధరిత్రిని కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ..
X

దిశ, మరిగూడ : మానవ మనుగడ సజావుగా సాగాలంటే దరిత్రిని కాపాడుకోవడం ఒకటే మార్గమని పర్యావరణ నిపుణుడు ఉస్మానియా యూనివర్సిటీ పర్యావరణ విభాగం అతిధి అధ్యాపకుడు డాక్టర్ మంచాల లింగస్వామి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా పర్యావరణం కాలుష్యం అవుతుందన్నారు. పర్యావరణం దెబ్బ తినడం వల్ల జీవ వైవిధ్యం అంతరించిపోతుందని అన్నారు. ప్రణాళిక లేని నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల నేల, నీరు, గాలి కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయని పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను విడుదల చేసే పదార్థాలను అతిగా వాడడం వాతావరణంలో మార్పులు సంభవించి గ్లోబల్ వార్మింగ్ సమస్య తలెత్తుతుందని అన్నారు.

గ్లోబల్ వార్మింగ్ రోజు రోజుకీ పెరిగిపోతూ భూగోళానికి పెను ముప్పుగా పరిణమిస్తోందని పేర్కొన్నారు. భూతాపం పెరిగి అసాధారణ స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే భూగోళం నిప్పుల కుంపటిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరో వైపు అతిగా ప్లాస్టిక్ వాడడం వల్ల భూగోళంపై ఘన వ్యర్ధాలు విరిగిపోతాయని, ప్రతి ఒక్కరూ విధిగా 4ఆర్ "రెడ్యూస్-రీయూజ్- రీసైకిల్-రికవరీ" ఫార్ములాను పాటించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క పౌరుడు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది" అని అప్రమత్తంగా ఉండకపోతే మానవ మనుగడ కష్టమని హెచ్చరించారు.



Next Story

Most Viewed