బీఆర్ఎస్ లో అంతా వికృత చేష్టలే

by Naveena |

బీఆర్ఎస్ పార్టీకి వికృత చేష్టలు అలవాటుగా మారాయని,ఆ పార్టీ వారికి స్పీకర్ అంటే గౌరవ తత్వం లేదని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ పేర్కొన్నారు. ఈరోజు

బీఆర్ఎస్ లో అంతా వికృత చేష్టలే
X

దిశ, తుంగతుర్తి: బీఆర్ఎస్ పార్టీకి వికృత చేష్టలు అలవాటుగా మారాయని,ఆ పార్టీ వారికి స్పీకర్ అంటే గౌరవ తత్వం లేదని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ పేర్కొన్నారు. ఈరోజు సభలో జరిగిన వికృతి చేష్టలు ఇందుకు నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా పెట్టుకోవడమే కాకుండా ఆనాడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను అవమానించారన్నారు. తర్వాత మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ను అవమానించారని తెలిపారు. కేసిఆర్ తో పాటు ఆయన కుటుంబీకులు,వెంట ఉన్నవారికి మాల,మాదిగలు అంటే పడదని అన్నారు. స్పీకర్ సీట్లో ఎవరు కూర్చున్నా అది ఎంతో గౌరవప్రదమని,సభను గౌరవించే తత్వం ఉండాలని పేర్కొన్నారు. అవన్నీ మర్చిపోయిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చిల్లరగా మాట్లాడారని మండిపడ్డారు. అహంకారంతో మాట్లాడిన ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. జగదీశ్ రెడ్డి చిల్లరగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ దళితులందరిని అవమానపరచడమేనని అన్నారు.

Next Story