- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఆత్మకూరు(ఎం) : ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల బిక్షం డిమాండ్ చేశారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామంలో గ్రామ సమస్యలపై ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల బిక్షం మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇప్పటికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రైతు భరోసా, పంట రుణాలు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో మురికి కాలువలు, సీసీ రోడ్లు, వీధిలైట్లు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రాచమల్ల సత్తయ్య, తుమ్మల సత్యనారాయణ రెడ్డి, బుచ్చయ్య, నర్సయ్య, మల్లయ్య, నర్సయ్య, లక్ష్మయ్య, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.






