కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేయండి..

by Disha Web Desk 20 |
కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేయండి..
X

దిశ, నేరేడుచర్ల : అదికారులంతా కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేయాలని మీ దగ్గరకు వచ్చే సమస్యలు మీ దగ్గరే పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని అలా పనిచేసే వారికి విలువ ఉంటుందని రెవెన్యూ తహశీల్దారులను ఉద్దేశించి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్ పట్టణంలోని జీవీపీ ఫంక్షన్ హల్ లో హుజూర్‌నగర్ ఆర్డీవో గా పనిచేసి బదిలీ పై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు ఆర్డీవో గా వెళ్తున్న వెంకారెడ్డికి విడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అధికారికి మనం చేసే పనిని బట్టి మనకు విలువ ఉంటుందని అన్నారు. మన దగ్గరికి వచ్చే వారందరికీ పనులు కావనీ.. సాధ్యం అయ్యే వరకు పనిచేయాలని అధికారులకు సూచించారు. హుజూర్ నగర్ లో ఆర్డిఓ కార్యాలయం ఏర్పడగానే పని చేసే ఆర్డీవో కోసం వెతుకుతున్న సమయంలో మంచి పనిచేసే అధికారిగా వెంకారెడ్డి పేరు తెలిసిందని, ఆయనను తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

పనిచేసే అధికారులను అలా వెతుక్కుంటూ తీసుకోవచ్చుకుంటారని అని అలాగే మిగతా అధికారులందరూ కూడా ఆ విధంగా పనిచేసే పేరు తెచ్చుకోవాలని అధికారులకు సూచించారు. వెంకారెడ్డి ఎక్కడ పనిచేసినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని అన్నారు. అధికారులు బదిలీ పై ప్రజలు వెళ్లేటప్పుడు ప్రజలు క్రింది స్థాయి అధికారులంతా బాధపడే విధంగా వెంకారెడ్డి పని చేశారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో పాటు రెవెన్యూ అధికారులు, జర్నలిస్టులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సమావేశంలో హుజూర్‌నగర్ ఎంపీపీ గూడెపు శ్రీను, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, హుజూర్‌నగర్ సీఐ రామలింగారెడ్డి, కమీషనర్ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకట్ రెడ్డి, తాహశీల్దార్లు జయశ్రీ, కార్తికేయ, సరిత, సాయిరాం, దామోదర్, వాజిద్ అలీ, జర్నలిస్టులు రావుల రాజు, నాగుల్, మీరా రమేష్ రెడ్డి, ఉష శ్రీ, పండ్ల నాగరాజు, క్రాంతి రాంబాబు, మధు, శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.



Next Story