కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి : జేపీ నడ్డా

by Disha Web Desk 22 |
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి : జేపీ నడ్డా
X

దిశ, నేరేడుచర్ల: ఒక నాణ్యానికి రెండు వైపులా ఎలా ఉంటాయో అలాగే ఒక వైపు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి ఉన్నాయని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపించారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద బీజేపీ పార్టీ అభ్యర్థి చల్ల శ్రీలత విజయాన్ని ఆకాంక్షిస్తూ బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఎన్నో నిధులు కేటాయించిందని కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వర్గాలకు మాత్రమే బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుందని నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ను దానిని 16% పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ పాలన చూస్తే ఎంతో బాధగా ఉందని ఇక్కడి ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఒకే మతానికి చెందిన వారికి ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్ట చారి రాక్షసుల సమితి అని అభివర్ణించారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి అసైన్ఢ్ భూములను ధరణి పోర్టల్ లో తీసుకురాకుండా వేలాదిమంది రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి , పెద్దలకు డబ్బులు దాచుకునేందుకు ఒక మిషన్ లాగా ఉపయోగపడుతుందని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విలువ రూ. 35 వేల కోట్లు అయితే దాని ఒక లక్ష్యం రూ. 38 కోట్లకి పెంచి దానిని ఒక ఏటీఎం మిషన్ లాగా మార్చాకున్నారని ధ్వజమెత్తారు. దళిత బంధు స్కీములో 30% ఎమ్మెల్యేలే కమీషన్ తీసుకున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారిందన్నారు. ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో రెండున్నర లక్షల మంది నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తే దానిని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదని ఆరోపించారు. మహిళలు ఆత్మగౌరవంగ జీవించాలన్న, అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి కల్పించాలన్న, రైతులకు మేలు చేయాలన్న అది బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమైతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 45 సంవత్సరాలు అధికారంలో ఉండి వేలాదిమంది యువకులను బలి తీసుకోవడానికి కారణమైందని దుయ్యబట్టారు. 1969లో 369 మంది యువకులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అన్నారు. అలాగే మలిదశ ఉద్యమంలో 2004లో 1500 మంది యువకుల బలిజనాల కారణం కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. సోనియా గాంధీ 2004లో తెలంగాణ ఇస్తానని వాగ్దానం చేసిందన్నారు. డిసెంబర్ 2009 డిసెంబర్లో తెలంగాణ ఇచ్చి వాపు తీసుకోవడంతో విద్యార్థులు కల్పించింది దుర్మరణం చెందారని 2014 వరకు అదే విధంగా సతాయించిందన్నారు. మోడీ ప్రభుత్వంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందన్నారు. వ్యవసాయ రంగానికి గత 10 ఏళ్లలో ఆరు రేట్లు బడ్జెట్ పెంచిందని గుర్తు చేశారు. రైతులు ఫర్టిలైజర్ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని పునర్జించావని తెలిపారు.

మహిళ స్వయం సహాయక బృందాలకు ఒక శాతం వడ్డీతోనే రుణాలను అందిస్తామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ద్వారా ఆరు నెలలకు ఒకసారి నోటిఫికేషన్ లేసి ఉద్యోగాలు కల్పిస్తామని సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలని వాటిని పారదోలి ప్రజలకు పిలుపునిచ్చారు. హుజూర్నగర్ లో చల్ల శ్రీలత కోదాడలో సతీష్ రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు. బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రం అభివృద్ధి చేసి చూపిస్తామని కోరారు.

Next Story

Most Viewed