- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎండిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి : బీజేపీ
చెరువులలో నీళ్లు లేక, పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని, ఎండిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : చెరువులలో నీళ్లు లేక, పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని, ఎండిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం, మాసాయిపేట, మల్లాపురం పలు గ్రామాలలో భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో.. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెరువులు నింపుతానని చెప్పడంతో రైతులు పొలాలు నాటు వేశారని, తీరా నాటు వేశాక చెరువులు నింపకపోవడం వల్ల పొలాలు మొత్తం ఎండిపోయాయని విమర్శించారు. పశువులకు కూడా నీళ్లు లేక, గడ్డి లేదని నాలుగు నెలల నుండి పాల బిల్లులు కూడా రావడం లేదన్నారు. పంటలు పండక రైతులు పశువులను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎకరానికి రూ. 40వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షురాలు గుంటిపల్లి మహేశ్వరి, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి, గంధమల్ల మహేష్, గుండా నర్సింలు, షారాజీ లక్ష్మయ్య, నేరెళ్ల సంతోష్, కోల విక్రమ్, శేఖర్, గోపగాని ప్రసాద్, దేవా బాలయ్య, సుబ్బూరు వీరస్వామి, శ్రీశైలం, ఉపేందర్, బుచ్చిబాబు, వాల్మీకి, అజయ్, సురేష్, దేవ, శ్యామ్, మహేందర్ పాల్గొన్నారు.






