రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..!

by Bhanu |

సూర్యాపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఆయన శనివారం చిలుకూరులోని పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు.

రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..!
X

దిశ, చిలుకూరు: సూర్యాపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఆయన శనివారం చిలుకూరులోని పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు. ప్రజలు క్రమశిక్షణతో శాంతియుతంగా తమ ఓట్లు వినియోగించుకోవాలన్నారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ఎలాంటి పొరపాట్లు లేకుండా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అనుకోని సంఘటనలు ఎదురైతే వెంటనే మండలం, జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మధ్యాహ్నం 1 గంట తరువాత ఓటర్లు లైన్లో ఉంటే వారికి టోకెన్లు కేటాయించాలని అన్నారు.

కౌంటింగ్ కేంద్రం దూరంగా ఉంటే స్టేజ్-2 ఆర్వోలు పోలీసుల రక్షణతో బ్యాలెట్ పెట్టెలు తరలించాలని కలెక్టర్ అన్నారు. పోలింగ్ ఏజెంట్లు, ఓట్ల లెక్కింపు బల్లలకు మధ్య దూరం పాటించాలని, లెక్కింపు పూర్తయ్యాక స్టేజ్-2 అధికారులు తప్పనిసరిగా జిల్లా ఎన్నికల అధికారి, జనరల్ అబ్జర్వర్ అనుమతి తీసుకుని ఫలితం ప్రకటించాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఎన్నికల అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక బ్యాలెట్ పత్రాలను, కవర్లు, సామగ్రిని రిసెప్షన్ కేంద్రంలో అప్పగించి, రెండో విడత పోలింగ్ ను సిబ్బంది విజయవంతం చేయాలని కలెక్టర్ పవార్ కోరారు. మండల ఎన్నికల అధికారి దయా నందరాణి, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, తహశీల్దార్ ధృవ్ కుమార్, ఎంపీడీవో కందాళ గిరిబాబు, స్థానిక ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Next Story