- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లబ్ధిదారుల దరఖాస్తుల స్క్రూటిని ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలి...కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాములైన రాజీవ్ యువ వికాసం ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తు స్కూటీని ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాములైన రాజీవ్ యువ వికాసం ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తు స్కూటీని ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ లో ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం లపై సంబంధిత శాఖల అధికారులతో దరఖాస్తుల స్క్రూటీని ప్రక్రియపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ రెండవ తేదీన రాజీవ్ యువ వికాస పథకం ఇందిరమ్మ ఇండ్లు పథకాలను అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జారీ చేయవలసి ఉన్నందున స్క్రూటిని ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలన్నారు. బ్యాంకులలో దరఖాస్తులు పెండింగ్ లేకుండా 95% పూర్తయిందన్నారు. 4314 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నందున అందుకు కారణాలను విశ్లేషించి తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించని లబ్ధిదారుల దరఖాస్తులను నోటీసులు ఇచ్చి తెలపాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో భాగంగా 160 ఇండ్లు బేస్మెంట్ పూర్తి చేసు కున్న లబ్ధిదారులకు లక్ష రూపాయలు వారి ఖాతాలలో వేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ మొదలు పెట్టని లబ్ధిదారులను ఎంపీడీవోల ద్వారా గుర్తించి డి ఆర్ డి ఓ ద్వారా చేయూతని ఇప్పించాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పునాది చేపట్టి బేస్మెంట్ త్వరితగతిన పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని, వర్షాలు పడుతుండగా గోడలు నిర్మించుకోవచ్చు అని క్యూరింగ్ కు అవకాశం ఉంటుందన్నారు. పునాదిలో ఉంటే గుంటలలో నీళ్లు నిలిచి ఇంటి నిర్మాణం చేపట్టలేని పరిస్థితిలు ఉత్పన్నమవుతాయన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగదని సత్వరమే పరిష్కరించాలని, అలాగే ప్రజా పాలనలో కూడా సుమారు 30 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యపు రాశులు నిలవ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లారీల కొరత సృష్టిస్తే సదరు కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెడతామన్నారు. వారం రోజులపాటు అధికారులు అశ్రద్ధ చేయకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పిసిఈఓ శోభారాణి, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






