మట్టపల్లికి సీఎం రేవంత్ రెడ్డి రాక.. ఎప్పుడంటే..?

by Naveena |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు రేషన్ ద్వారా పంపిణీ చేసే దొడ్డు బియ్యాన్ని బదులుగా సన్నబియ్యం ఇచ్చేందుకు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.

మట్టపల్లికి సీఎం రేవంత్ రెడ్డి రాక.. ఎప్పుడంటే..?
X

దిశ, హుజూర్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు రేషన్ ద్వారా పంపిణీ చేసే దొడ్డు బియ్యాన్ని బదులుగా సన్నబియ్యం ఇచ్చేందుకు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ముందస్తుగా ఈనెల 30న ఉగాది రోజున పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం (హుజూర్ నగర్ నియోజకవర్గంలో) ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికి వేదికగా మఠంపల్లి మండలంలోని మట్టపల్లిలో పురాతన ప్రసిద్ధి చెందిన క్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి పలువురు మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మట్టపల్లి రానున్నారు.

ముందుగా దైవదర్శనం.. తర్వాత నూతన పంచాంగం..

ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు మట్టపల్లి రానున్నారు. ముందుగా రాగానే ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. ఆ తర్వాత తెలుగు పర్వదినమైన ఉగాది పండుగ సందర్భంగా.. రోజు నూతన పంచాంగాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వం అమలు చేయబోనున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడే భారీ 30 వేల మంది మహిళలతో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు.

తొలిసారిగా హుజూర్ నగర్ నియోజకవర్గం పర్యటన

రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 16 నెలలు కావస్తున్న ఇప్పటివరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలలో కానీ... అభివృద్ధి కార్యక్రమాలను కానీ ఇప్పటివరకు పాల్గొనలేదు. గతంలో టీపిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలోను .. ఆ తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Next Story