ఆంజనేయుని కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి : మాజీ మంత్రి

by Disha Web Desk 23 |
ఆంజనేయుని కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి : మాజీ మంత్రి
X

దిశ, కాటారం : భక్త ఆంజనేయులు కృపతో ఈ ప్రాంతం .. ప్రజలంతా సుభిక్షంగా సుఖమయంగా ఉండాలని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. కాటారం మండలంలోని గారేపల్లి గ్రామంలో నూతనంగా ఆలయ ప్రతిష్ట చేసిన భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించేందుకు తగిన బలాన్ని ఇవ్వాల్సిందిగా ప్రజల కోసం ప్రార్ధించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం వెళ్లే ప్రధాన రహదారిపై భక్తాంజనేయ స్వామి దేవాలయం ఉండడం, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే పునర్ నిర్మించి ప్రతిష్ట చేయడం పట్ల అందరికీ శ్రీధర్ బాబు అభినందించారు. ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించేందుకు, ప్రజలు తమకు మద్దతు పలికేలా ఆశీర్వచనం చేసి భక్తాంజనేయ ఆలయంలో మహిమ పెంపొందించేలా ఆలయ అర్చకులు నాగరాజు శర్మ నిత్యం పూజలు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

ఆలయ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తానని అన్నారు. ఆలయ ప్రతిష్ట లో పాల్గొన్న భక్తజనానికి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. అచలాపురం వేద పాఠశాల ప్రధానాచార్యులు మనోహర్ అవధాని మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి కోసం శ్రీధర్ బాబు కృషి చేస్తున్నాడని అచలాపురంలో వేద పాఠశాల కోసం విరాళం ఇచ్చారని, ప్రజా సమస్యలు పరిష్కరించే వ్యక్తులకు ప్రజలు తమ తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి , కొట్టే శ్రీహరి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్,కొట్టే ప్రభాకర్, ఆంగోతు సుగుణ, ఎంపీటీసీ జాడి మహేశ్వరి, చీమల రాజు , దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed