ఇతర ప్రాంతాల ధాన్యం రాకను కట్టడి చేయాలి..

by Disha Web Desk 20 |
ఇతర ప్రాంతాల ధాన్యం రాకను కట్టడి చేయాలి..
X

దిశ, మిర్యాలగూడ : ఇతర ప్రాంతాల నుండి మిర్యాలగూడ మిల్లులకి ధాన్యం రాకను కట్టడి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఉద్యోగులను ఆదేశించారు. శనివారం మిర్యాలగూడ మండలంలోని ఆలగడప టోల్ గేట్ వద్ద పట్టుబడిన రెండు ధాన్యం లారీలను వివరాలను విచారించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏపీ నుండి ధాన్యం రాకుండా వాడపల్లి, ఆలగడప సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇందుకోసం రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని, ఉద్యోగ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల ధాన్యం మిల్లులకి రాకుండా గట్టిచర్యలు తీసుకోవాలని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అనిల్ కుమార్, రూరల్ ఎస్సై నర్సింహులు, సివిల్ సప్లై డీటీ రామకృష్ణారెడ్డి, ఆర్ఐలు సురేందర్ సింగ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed