- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై వాట్సాప్ గ్రూప్ లలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గ్యార సందీప్ అన్నారు.

దిశ,భూదాన్ పోచంపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై వాట్సాప్ గ్రూప్ లలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గ్యార సందీప్ అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై భాస్కర్ రెడ్డికి పోస్టులు పెట్టిన వారుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచంపల్లి అంటేనే ప్రశాంత వాతావరణానికి చిహ్నం అని, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం దారుణమని ,ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సీత సుధాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జయసూర్య,జిల్లా కార్యదర్శి చేరాల సుదీర్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రుద్ర చందు,జినుకల కుమార్, ఎన్.యస్.యు.ఐ పట్టణ అధ్యక్షులు కుక్క అరుణ్, పెంట నవీన్,గంగాదేవి మహేష్, నాయకులు చేరాల మహేందర్,గొలి నందు,కుక్క వంశి,కస్తూరి భాస్కర్,గుత్తి బాల శంకర్,మధు తదితరులు పాల్గొన్నారు.






