మనస్థాపంతో వ్యక్తి మృతి.. అధికారుల తీరుపై మండిపడుతున్న గ్రామస్థులు

by Disha Web |
మనస్థాపంతో వ్యక్తి మృతి.. అధికారుల తీరుపై మండిపడుతున్న గ్రామస్థులు
X

దిశ, భువనగిరి రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బి ఎన్ తిమ్మాపురంలో విషాదం జరిగింది. బి ఎన్ తిమ్మాపురం గ్రామస్తులు గత 57 రోజులుగా ముంపుకు గురవుతున్న తమ ఇళ్లకు, భూములకు పరిహారం అందించాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వారి బాధ పట్టించుకోకుండా అధికారులు తమ ఇండ్లకు నోటీసులు ఇవ్వడం జరిగిందని.. దీంతో గ్రామానికి చెందిన జూపల్లి నర్సింహా (46) మనస్తాపం చెంది గుండెపోటుతో మరణించాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

మృతుడు ఆటో నటుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని, తనకున్న కొద్దిపాటి భూమి బస్వాపురం రిజర్వాయర్‌లో పోవడంతో గత కొంత కాలం మధన పడుతూ ఉన్నాడని వారు తెలిపారు. తమకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా అధికారులు నోటీసులు ఇవ్వడంతోనే నరసింహా మరణించాడని అధికారుల తీరుపై గ్రామస్థులు మండిపడ్డారు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా రిజర్వాయర్ ఆఫీస్ ఎదురుగా మృతదేహంతో ధర్నా నిర్వహిస్తున్నారు గ్రామస్థులు.Next Story